Prakash Raj: కొండా సురేఖ.. సిగ్గులేదా నీకు?
Prakash Raj: కాంగ్రెస్ నేత కొండా సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షాకింగ్ ట్వీట్ చేసారు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వల్లే సమంత, నాగచైతన్యలు విడిపోయారంటూ కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్ చేసారు. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. ఏంటీ సిగ్గులేని రాజకీయాలు? సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే అంత చిన్న చూపా నీకు? అంటూ ప్రకాష్ రాజ్ కొండా సురేఖపై మండిపడ్డారు.
ప్రకాష్ రాజ్‌కి కేటీఆర్ అన్నా కేసీఆర్ అన్నా అమితమైన గౌరవం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితే అధికారంలోకి రావాలని ఆశించిన వారిలో ప్రకాష్ రాజ్ ఒకరు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. మతతత్వ రాజకీయాలు చేసే పార్టీల కంటే కుటుంబ రాజకీయాలు చేసే వారే ఎంతో బెటర్ అని ప్రకాష్ రాజ్ అప్పట్లో ఓ డిబేట్‌లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.