యాంక‌ర్ ప్రదీప్ రెండో సినిమాకు ప‌వ‌న్ టైటిల్

pradeep machiraju gets pawan kalyan title

Pradeep: ప్ర‌ముఖ యాంక‌ర్ ప్రదీప్ మాచిరాజు త‌న రెండో సినిమాను ఈరోజు ప్ర‌క‌టించ‌నున్నాడు. ఈ సినిమాకు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ అనుకుంటున్నార‌ట‌. ప‌వ‌న్ న‌టించిన అక్క‌డ‌మ్మాయ్ ఇక్క‌డ‌బ్బాయ్ టైటిల్‌ను ఈ సినిమాకు పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. యాంక‌రింగ్ రంగంలో త‌న‌కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్ర‌దీప్ 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా అనే సినిమాతో సినిమా కెరీర్‌ను మొద‌లుపెట్టేసాడు. ఆ సినిమా ఫ్లాప్ అయిన‌ప్ప‌టికీ క‌థ ప‌రంగా మంచి మార్కులు ప‌డ్డాయి. ఇప్పుడు ప్ర‌దీప్ చాలా కాలం త‌ర్వాత రెండో సినిమాతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌బోతున్నాడు.