Ulfa: ఇది టైటిలా..? ఇదే టైటిలా..?

Hyderabad: ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ ప్ర‌భుదేవా (prabhudeva) ఓ కొత్త సినిమాతో ఆడియ‌న్స్‌ను అల‌రించ‌బోతున్నారు. ఈసారి ఆయ‌న ప్యాన్ ఇండియా రేంజ్‌లో సినిమా తీయాల‌ని గ‌ట్టిగా ఫిక్స్ అయ్యారు. సినిమాకు ఊల్ఫ్ (wolf) అని టైటిల్ పెట్టారు. అంటే తోడేలు. దీనిని తమిళంతో పాటు తెలుగు, హిందీ భాష‌ల్లోనూ రిలీజ్ చేయ‌నున్నారు. అయితే తెలుగులో సినిమా పేరును తోడేలు అని కాకుండా వూల్ఫ (ulfa) అని పెట్టారు. దాంతో ఈ పోస్ట‌ర్‌పై ట్రోలింగ్ మామూలుగా లేదు. వూల్ఫ ఏంట‌న్నా ఉల్ఫ‌లాగా అంటూ కామెంట్స్ వ‌స్తున్నాయి. బ‌హుశా తెలుగులో ఆల్రెడీ తోడేలు అనే హిందీ సినిమా డ‌బ్బింగ్ అయ్యింది కాబ‌ట్టి ఇలా పెట్టారేమో. అయితే మాత్రం ఇంకో పేరు దొర‌క‌లేదా..!