Salaar: ష్యూర్ షాట్ బ్లాక్ బ‌స్ట‌ర్..!

ప్ర‌భాస్ (prabhas) న‌టించిన స‌లార్ (salaar) భారీ అంచనాల న‌డుమ ఈరోజు రిలీజ్ అయ్యింది. ప్ర‌శాంత్ నీల్‌పై (prashanth neel) ఫ్యాన్స్ పెట్టుకున్న న‌మ్మకాన్ని వ‌మ్ము చేయ‌కుండా ఫ్యాన్స్ త‌లెత్తుని తిరిగేలా సినిమా తీసార‌న్న టాక్ వినిపిస్తోంది. రాధే శ్యాం, ఆదిపురుష్ సినిమాలు ప్ర‌భాస్‌పై నెగిటివ్ ఇంపాక్ట్ వ‌చ్చేలా చేసాయ్‌. దాంతో మ‌ళ్లీ డార్లింగ్ ఎప్పుడు స‌రైన సినిమాతో ట్రోల్ చేసిన‌వారి నోళ్లు మూయిస్తారా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసారు. అలా ప్ర‌శాంత్ నీల్ దేవుడిలా వ‌చ్చి ప్ర‌భాస్‌కు చాలా కాలం త‌ర్వాత ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చారు. స‌లార్ సునామీలో యానిమ‌ల్ కొట్టుకుపోయిన‌ట్లే కనిపిస్తోంది. ఇక సినిమా ఓపెనింగ్ క‌లెక్ష‌న్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయో చూడాలి.