Prabhas: రాముడు.. కృష్ణుడు… శివుడు…!

రెబెల్ స్టార్ ప్ర‌భాస్‌ను (prabhas) శ్రీరాముడిగా ఆదిపురుష్ (adipurush) సినిమాలో చూసేసాం. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ సినిమాను ఎలా నాశ‌నం చేసాడు అన్న విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే రాముడిలా మాత్రం ప్ర‌భాస్ లుక్ అదిరింది. ఈ త‌రానికి శ్రీరామ‌చంద్రుడు అంటే ఇలాగే ఉంటాడేమో అనేలా చూపించారు. ఇప్పుడు ప్ర‌భాస్‌ని క‌ల్కి (kalki 2898 ad) సినిమాలో శ్రీకృష్ణుడి ప‌దో అవ‌తారం అయిన క‌ల్కి అవ‌తారాన్ని చూడ‌బోతున్నాం.

నాగ్ అశ్విన్ (nag ashwin) టేక‌ప్ చేసిన ఈ ప్ర‌తిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో ప్ర‌భాస్ మోడ్ర‌న్ క‌ల్కిగా క‌నిపించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇక మిగిలింది. శివుడి గెట‌ప్. ఈ కోరిక‌ను నేను నెర‌వేరుస్తానని ముందుకొచ్చాడు మంచు విష్ణు (manchu vishnu). ఆయ‌న క‌న్న‌ప్ప (kannappa) అనే ప్రాజెక్ట్‌ను ఇటీవ‌ల స్టార్ట్ చేసాడు. సినిమా మొత్తం విదేశాల్లోనే షూటింగ్ చేస్తామ‌ని షూట్ అయ్యేవ‌ర‌కు రామ‌ని తెలిపారు. ఇందులో కృతి స‌న‌న్ సోద‌రి నుపూర్ స‌న‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో శివుడి గెట‌ప్‌లో ప్ర‌భాస్ యాక్ట్ చేస్తే బాగుంటుంద‌ని విష్ణు అనుకున్నార‌ట‌. అందులోనూ మోహ‌న్ బాబు, కృష్ణంరాజు కుటుంబాల మ‌ధ్య మంచి స్నేహం ఉంది. త‌ను అడిగితే కాద‌న‌డు అన్న న‌మ్మ‌కంతో విష్ణు ప్ర‌భాస్‌ను అప్రోచ్ అయ్యాడు. ప్ర‌భాస్ కూడా ఒప్పుకున్నారు. సో.. ప్ర‌భాస్‌ని రామ‌య్య‌, కృష్ణుడు, శివుడి గెట‌ప్స్‌లో చూడ‌బోతున్నామ‌న్న మాట‌..! (prabhas)