Prabhas: స‌లార్ క్రూ మెంబ‌ర్స్‌కి ప్ర‌భాస్ సాయం

Hyderabad: ప్ర‌భాస్ (prabhas) ప్ర‌శాంత్ నీల్ (prashant neel) కాంబినేష‌న్‌లో వ‌స్తున్న స‌లార్ (salaar) సినిమా షూటింగ్ పూర్త‌యిన‌ట్లుంది. ఈ సంద‌ర్భంగా క్రూ మెంబ‌ర్స్‌కి ప్ర‌భాస్ ఆర్ధిక సాయం చేసాడు. మెంబ‌ర్స్ అంద‌రికీ బ్యాంకుల్లో రూ.10000 న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్ చేయించాడు. అంద‌రూ క‌ష్ట‌ప‌డితేనే స‌లార్ (salaar) సినిమా అనుకున్న స‌మ‌యానికి పూర్త‌యినందుకు ప్ర‌భాస్ ఇలా థ్యాంక్స్ చెప్పాడ‌ని అంటున్నారు. ఇందులో శ్రుతి హాస‌న్ (shruti haasan) హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ రావాల్సి ఉంది. అప్డేట్స్ అడుగుతున్నార‌ని ఇప్ప‌టికే ప్ర‌శాంత్ నీల్, ప్రొడ్యూస‌ర్ విజ‌య్ కిర్గందూర్‌లు సోష‌ల్‌మీడియా నుంచి ఎగ్జిట్ అయ్యారు.