Prabhas: సినిమాల నుంచి బ్రేక్

Prabhas: రెబెల్ స్టార్ ప్ర‌భాస్ కొంత‌కాలం పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకోనున్నారు. ఆయ‌న మోకాలికి స‌ర్జ‌రీ జ‌రిగిన‌ప్ప‌టి నుంచి క‌నీసం రెస్ట్ లేకుండా వ‌రుస షూటింగ్‌ల‌లో పాల్గొంటున్నారు. ఈ నేప‌థ్యంలో వైద్యులు ఇక కొన్ని నెల‌ల పాటు త‌ప్ప‌కుండా రెస్ట్ ఇవ్వాల‌ని లేదంటే ప్ర‌మాద‌మ‌ని చెప్పార‌ట‌. దాంతో మార్చి వ‌ర‌కు ప్ర‌భాస్ ఇంటి నుంచి కాలు బ‌య‌ట‌పెట్ట‌ద‌ల‌చుకోలేద‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. ఏప్రిల్ నుంచి మారుతి డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న రాజా సాబ్ సినిమా షూటింగ్‌లో ప్ర‌భాస్ పాల్గొంటారు.