Prabhas: మరోసారి రామాయణంలో
Prabhas: రెబెల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ రాముడి పాత్ర.. అందులోని పాటలు తప్ప ఇంకేమీ హైలైట్ అవ్వలేదు. పైగా దర్శకుడు ఓం రౌత్ పట్ల ఎంత ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే. ఇంకోసారి ప్రభాస్‌తో సినిమా తీయాలన్న ఆలోచన కూడా రాకుండా ఫ్యాన్స్ రౌత్‌కి వార్నింగ్‌లు ఇచ్చారు. అయితే.. ఇప్పుడు బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ రామాయణ్ పేరిట మరో సినిమా తీస్తున్నారు. ఇందులో రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్రలో.. సాయి పల్లవి సీత పాత్రల్లో నటిస్తున్నారు.
అయితే ఇందులో ప్రభాస్‌ను కూడా తీసుకోవాలని నితేష్ అనుకుంటున్నారట. ఆల్రెడీ రాముడిగా రణ్‌బీర్ నటిస్తుంటే మరి ప్రభాస్ ఎందుకు అనుకుంటున్నారా? ఇందులో ప్రభాస్ రాముడిగా కాదు కానీ పరశురాముడిగా నటించబోతున్నారట. ఇదే విషయం గురించి దర్శకుడు నితేష్ ప్రభాస్‌తో మాట్లాడారు. కానీ ప్రభాస్ ఇంకా ఏమీ సమాధానం ఇవ్వలేదట. ఆదిపురుష్ తర్వాత ఇలాంటి సినిమాలకు కాస్త దూరంగా ఉండాలని ప్రభాస్ నిర్ణయించుకున్నాడు. అయితే.. ఇది పరశురాముడి పాత్ర కావడం.. నితేష్ ఓం రౌత్లా గ్రాఫిక్స్ పెట్టి సినిమా తీసే రకం కాదని ప్రభాస్‌కి కూడా తెలుసు. ఎందుకంటే గతంలో నితేష్ తీసిన దంగల్ సినిమా ఏ రేంజ్లో బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించిందో అందరికీ తెలుసు. అందుకే ప్రభాస్‌కి నితేష్‌పై కాస్త నమ్మకం ఉంది. ఈ సినిమాలో పరశురాముడి పాత్రలో నటించడానికి ప్రభాస్ ఒప్పుకుంటే మాత్రం ఆ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో చెప్పనక్కర్లేదు..!