Adipurush: 2000 కోట్లు రాకపోతే.. ప్రభాస్ సూపర్ కామెడీ

Hyderabad: యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్‌(prabhas).. ఆదిపురుష్(adipurush) ట్రైల‌ర్ లాంచ్ టైంలో చేసిన కామెడీ వైర‌ల్ అవుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీస్తున్న సినిమా ఆదిపురుష్‌. ప్ర‌భాస్ రామయ్య‌గా కృతి స‌న‌న్ సీత‌మ్మ‌గా న‌టించారు. మొన్ననే హైద‌రాబాద్‌లో ట్రైల‌ర్ రిలీజ్ చేసారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ ఫ్యాన్స్‌తో చాలా స‌ర‌దాగా మాట్లాడారు. ట్రైలర్ రిలీజ్ చేద్దామ‌నుకున్న‌ప్పుడు ముందు హైద‌రాబాద్‌లోనే రిలీజ్ చేద్దామ‌ని నేనే చెప్పాను. ఎందుకంటే మీకు న‌చ్చితే మిగ‌తా భాష‌ల్లోనూ హిట్ అవుతుంది. అని ప్ర‌భాస్ మాట్లాడుతుండ‌గా ఓ ఫ్యాన్‌.. 2000 కోట్లు అని అరిచాడు. దాంతో ప్ర‌భాస్‌.. 2000 కోట్ల క‌లెక్ష‌న్స్ రాక‌పోతే నిన్నే అడుగుతా అంటూ కామెడీగా మాట్లాడారు. ఇంట్రోవ‌ర్ట్‌గా క‌నిపించే ప్ర‌భాస్ ఎంత బాగా మాట్లాడారో ఈ వీడియోలో మీరూ చూసేయండి.