Prabhas Sreenu: హీరోయిన్‌కి ముద్దు పెట్ట‌చ్చా నాన్నా అని అడిగాడు

Prabhas Sreenu reveals interesting details about adavi ramudu kiss scene

Prabhas Sreenu: ప్ర‌ముఖ హాస్య న‌టుడు ప్ర‌భాస్ శ్రీను.. రెబెల్ స్టార్ ప్ర‌భాస్ గురించి ఒక ఆస‌క్తిక‌ర విష‌యాన్ని పంచుకున్నారు. ప్ర‌భాస్ శ్రీను ప్ర‌భాస్‌కి క్లాస్‌మేట్. ప్ర‌భాస్‌తో శ్రీనుకి మంచి అనుబంధం ఉంది. ఈ నేప‌థ్యంలో అడ‌వి రాముడు సినిమా షూటింగ్ స‌మ‌యంలో జ‌రిగిన ఓ ఆసక్తిక‌ర‌మైన అంశం గురించి షేర్ చేసుకున్నారు.

“” ప్రభాస్‌కి వాళ్ల నాన్నంటే చాలా ఇష్టం. అడ‌వి రాముడు సినిమాలో ఓ కిస్ సీన్ ఉంది. ఆ సీన్ చేయ‌డానికి ముందు ప్ర‌భాస్ వాళ్ల నాన్న‌కు ఫోన్ చేసి నాన్నా కిస్ సీన్ అంట‌.. చేయ‌నా వ‌ద్దా? అని అడిగాడు. సినిమానే క‌ద‌రా పెట్టేయ్ అని వాళ్ల నాన్న చెప్పాక ఆ సీన్‌కి ఓకే చేసాడు. ప్ర‌భాస్‌కి వాళ్ల నాన్న‌తో ఉన్న అనుబంధాన్ని చూస్తే కుళ్లుకోవాల్సిందే “” అని తెలిపారు.