prabhas: మాట‌ల్లేవ్‌..!

Hyderabad: యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్(prabhas) నుంచి వ‌స్తున్న మైథ‌లాజిక‌ల్ ఎపిక్ ఆదిపురుష్‌(adipurush). బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్(om raut) దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో, కృతి స‌నన్ సీత‌మ్మ‌వారి పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను మే 9న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే టీం అనౌన్స్ చేసేసింది. అయితే.. ఆదిపురుష్ ట్రైల‌ర్‌ను ప్ర‌భాస్ చూసిన‌ట్లున్నారు. మాట‌ల్లేవ్‌.. జ‌స్ట్ ఫైర్ అని ఆయ‌న పోస్టర్ పెట్టి ఓ ట్వీట్ చేసారు. దాంతో ఫ్యాన్స్ మ‌రింత ఎక్సైట్ అవుతున్నారు.

ఆదిపురుష్ ట్రైలర్‌ని ఏకంగా 70 దేశాలలోని పలు థియేటర్లలో లాంచ్ చేయబోతున్నారు. భారతదేశంతో పాటు సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, మయన్మార్, శ్రీలంక, జపాన్‌తో సహా యూఎస్ఏ, కెనడా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆసియా, ఆఫ్రికా, యూకే అండ్ యూరప్, రష్యా, ఈజిప్ట్ దేశాల్లో ట్రైలర్ లాంచింగ్ జరగబోతోంది. ఎన్నో విమర్శలు, వివాదాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలను గ్రాండ్​గా ప్లాన్​ చేస్తున్నారు మేకర్స్​. ఆదిపురుష్ సినిమాను జూన్ 12న రిలీజ్ చేయనున్నారు.