Prabhas: తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటా!
Hyderabad: పెళ్లి చేసుకుంటే తిరుపతిలోనే చేసుకుంటానని అన్నారు రెబెల్ స్టార్ ప్రభాస్ (prabhas). ఆయన నటించిన ప్రతిష్ఠాత్మక ఆదిపురుష్ (adipurush) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న తిరుపతిలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసారు. ఈవెంట్‌కు ప్రభాస్, కృతి సనన్ (kriti sanon), డైరెక్టర్ ఓం రౌత్ (om raut), హనుమంతుడి పాత్రను పోషించిన దేవదత్త నగే (devadatta nage) తదితరులు వచ్చారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడారు.
“నేను ఆదిపురుష్ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు నాతో చిరంజీవి గారు మాట్లాడారు. ఏంటి రామాయణం చేస్తున్నావా అని అడిగారు. అవును అని చెప్పాను. నువ్వెంతో అదృష్టవంతుడివి.. రామాయణం చేసే ఛాన్స్ అందరికీ రాదు అని అన్నారు. అది నిజమే. నా టీం నిద్ర లేక ఎంతో కష్టపడ్డారు. అందుకు వారికి కృతజ్నతలు చెప్తున్నా. ఇక పెళ్లి గురించి అంటారా.. చేసుకుంటే ఇక్కడే తిరుపతిలోనే ఎప్పుడో ఒకప్పుడు చేసుకుంటా” అన్నారు. ఆదిపురుష్‌కి సినిమాకు సంబంధించి ఇదే చివరి ప్రమోషన్ అని ప్రభాస్ అన్నారు. సినిమా జూన్ 16న రిలీజ్ కాబోతోంది.