Prabhas: తార‌క్, చ‌ర‌ణ్‌తో సినిమా గ్యారెంటీ

Hyderabad: మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో (ram charan) కలిసి న‌టించ‌డం గ్యారెంటీ అని గుడ్ న్యూస్ చెప్పేసారు యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్ (prabhas). ఆయ‌న న‌టించిన ప్రాజెక్ట్ కే (project k) సినిమా టీజ‌ర్‌ను అమెరికాలోని సాన్‌డీగో కామికాన్‌లో రిలీజ్ చేసారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డి మీడియా వ‌ర్గాలు మీరు RRR రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌తో మాట్లాడుతుంటారా అని అడిగారు. దీనికి ప్ర‌భాస్ స‌మాధానం ఇస్తూ.. రామ్ చ‌ర‌ణ్, తార‌క్ నా బెస్ట్ ఫ్రెండ్స్. వారితో ఫ్యూచ‌ర్‌లో త‌ప్ప‌కుండా సినిమా చేస్తా అన్నారు.

మొత్తానికి ఆ ప్రాజెక్ట్ K అంటే ఏంటో టీజ‌ర్‌లో చెప్పేసారు డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్. సినిమా టైటిల్ క‌ల్కి 2898 AD (Kalki 2898 ad) అని టీజ‌ర్‌లో చూపించారు. ఇందులో దీపిక ప‌దుకొణె, దిషా ప‌టానీ హీరోయిన్స్‌గా యాక్ట్ చేస్తున్నారు. క‌మ‌ల్ హాస‌న్ (kamal haasan) విల‌న్ క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తున్నారు. అమెరికాలో ప్ర‌భాస్‌తో (prabhas) పాటు క‌మ‌ల్ కూడా ల్యాండ్ అయ్యారు. మీరెందుకు నెగిటివ్ క్యారెక్టర్ చేయ‌డానికి ఒప్పుకున్నారు అని క‌మ‌ల్‌ని అడిగితే.. నెగిటివ్ ఉంటేనే పాజిటివ్ అంటే ఏంటో తెలుస్తుంద‌ని, అందుకే ఇందులో నెగిటివ్ రోల్ చేయ‌డానికి ఒప్పుకున్నాన‌ని అన్నారు.