Salaar: రెండు భాగాలు.. కన్‌ఫార్మ్ చేసిన నటుడు!

Hyderabad: సెన్సేషనల్​ డైరెక్టర్​ ప్రశాంత్​ నీల్(Prashanth Neel)​ దర్శకత్వంలో పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్​ మూవీ సలార్(Salaar). కేజీఎఫ్(KGF), కేజీఎఫ్2(KGF2) భారీ సక్సెస్​ల తర్వాత ప్రశాంత్​ నీల్​ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో దీనిపై పాన్​ఇండియా స్థాయిలో భారీ అంచనాలే ఉన్నాయి.  ప్రస్తుతం ఈ మూవీ ఇటలీలో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ జరుగుతున్న ప్రభాస్ పై యాక్షన్ సీక్వెన్స్ షెడ్యూల్ గురించి రాస్తూ ఇటలీ మీడియా .. సలార్ రెండు భాగాలుగా రాబోతుంది అంటూ పేర్కొంది. దీంతో సలార్ రెండు భాగాలుగా రాబోతోందంటూ ఓ వార్త సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

అయితే దీని పై చిత్ర యూనిట్ అధికారికంగా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కాగా ఇప్పుడు ఇదే నిజమేనని తెలుస్తోంది. సలార్​ సినిమాలో నటిస్తున్న ప్రముఖ నటుడు దేవరాజ్(Devaraj) ఓ ఇంటర్వ్యూ సందర్భంగా స్వయంగా ఈ విషయాన్ని కన్‌ఫార్మ్ చేశారు. తాను ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాలో నటిస్తున్నట్లు తెలియజేసిన దేవరాజ్.. మొదటి భాగంలో తన పాత్ర పెద్దగా కనిపించదని, సెకండ్ పార్ట్ లో తన పాత్ర ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు.  దీంతో సలార్​ రెండు భాగాలుగా రానుందనే విషయం కన్ఫామ్​ అయ్యింది. కాగా ఈ సినిమాకి సంబంధించిన మరో వార్త కూడా సోషల్​ మీడియాలో హల్​చల్​ చేస్తోంది. సలార్ క్లైమాక్స్​ ఎపిసోడ్​లో యశ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, కేజీఎఫ్ 2 ని కనెక్ట్ చేసేలా రాకీ భాయ్ ఎంట్రీ ఇవ్వనున్నాడని వార్తలు వచ్చాయి.  అయితే కేజీఎఫ్​కీ సలార్​కీ సంబంధం లేదనీ, యశ్(Yash)​ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనపడనున్నారనీ సమాచారం. ఇక సలార్ సినిమాలో శ్రుతి హాసన్​(Shruti Haasan) హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.