Prabhas: డార్లింగ్స్.. ఫ‌స్ట్ లుక్ న‌చ్చిందా?

America: యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్ (prabhas) ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయ‌న న‌టిస్తున్న ప్రాజెక్ట్ K (project K) సినిమాలోని ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను అమెరికాలోని సాన్‌డీగో కామికాన్‌లో రిలీజ్ చేసారు. ఈ ఈవెంట్‌కి ప్ర‌భాస్‌తో (prabhas) పాటు రానా ద‌గ్గుబాటి (rana daggubati), క‌మ‌ల్ హాస‌న్‌ (kamal haasan) కూడా వెళ్లారు. ఇందులో క‌మ‌ల్ హాస‌న్ కీ రోల్‌లో న‌టిస్తున్నారు కాబ‌ట్టి వెళ్లారు. కానీ రానా ఎందుకు వెళ్లారో తెలియాల్సి ఉంది. త‌న బెస్ట్ ఫ్రెండ్ అయిన ప్ర‌భాస్ సినిమాను ప్ర‌మోట్ చేయ‌డానికి వెళ్లారేమో అని ఫ్యాన్స్ అంటున్నారు.

ఎటూ అమెరికాలో ఉన్నారు కాబ‌ట్టి అక్క‌డ మ‌న ఇండియాలో లాగా ఫ్యాన్స్ మీద‌కి వ‌చ్చేయ‌డం లాంటివి ఉండ‌వు కాబ‌ట్టి స‌ర‌దాగా ముగ్గురూ ఓ రెస్టారెంట్‌కి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. వారు ముగ్గురూ కూర్చుని స‌ర‌దాగా ముచ్చ‌ట్లు చెప్పుకుంటున్న ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.