Prabhas: సరిగ్గా నడవలేకపోతున్న రెబెల్ స్టార్!
Hyderabad: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్(prabhas) ఇప్పటికీ సరిగ్గా నడవలేకపోతున్నారు. నిన్న జరిగిన ఆదిపురుష్(adipurush) ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి వచ్చిన ప్రభాస్(prabhas) చాలా మెల్లిగా నడుస్తూ కనిపించారు. ఇందుకు కారణం ఐదేళ్ల క్రితం వచ్చిన సాహో సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదమే. సాహో షూటింగ్ టైంలో హై యాక్షన్ సీన్స్ చేస్తున్న సమయంలో ప్రభాస్ మోకాలికి గాయమైంది. అప్పటినుంచి ఆయన సరిగ్గా నడవలేకపోతున్నారు. డాక్టర్లు సర్జరీ చేయాలని చెప్పినా కంటిన్యుయస్‌గా ఐదు సినిమాలను ఓకే చేసారు. కేవలం రెండు వారాలు మాత్రమే రెస్ట్ తీసుకుని షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఇకపోతే ఆదిపురుష్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. గతంలో వచ్చిన టీజర్‌తో పోలిస్తే.. ట్రైలర్‌తో గూస్బంప్స్ తెప్పించారంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. జూన్‌లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు.