Prabhas: జీవితంలోకి స్పెషల్ వ్యక్తి వస్తున్నారు.. ప్రభాస్ పోస్ట్ వైరల్
Prabhas: ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. డార్లింగ్స్.. ఫైనల్లీ మన జీవితంలోకి ఓ స్పెషల్ వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చెయ్యండి అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. దాంతో ప్రభాస్ తనకు కాబోయే అమ్మాయిని పరిచయం చేయబోతున్నారేమో అని ఫ్యాన్స్ తెగ ఆనందంతో ఎదురుచూస్తున్నారు.
అయితే ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయ్యిందేమో అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రభాస్ సినిమాలకు సంబంధించిన విషయాల గురించి తప్ప తన పర్సనల్ అంశాలపై ఎప్పుడూ సోషల్ మీడియాలో చెప్పరు. ఇక పెళ్లి గురించైతే అసలే చెప్పరు. గతంలో కృతి సనన్‌తో ప్రభాస్ నిశ్చితార్థం అని తెగ రూమర్స్ వచ్చినప్పుడే ప్రభాస్ అసలు స్పందించలేదు. అలాంటిది నిజంగా పెళ్లి చేసుకోబోతుంటే ఇలా సింపుల్‌గా ఏదో సినిమా గురించి ప్రకటించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే ఛాన్సే లేదని మరికొందరి అభిప్రాయం.