Prabhas ఫ్యాన్స్ భయపెట్టారు.. చివరికి సలార్ పారిపోయింది
ప్రభాస్ (prabhas) ఫ్యాన్స్ తనను భయపెట్టాలనుకున్నారు కానీ చివరికి సలార్ (salaar) సినిమానే పారిపోయిందని అన్నారు బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి (vivek agnihotri). ఆయన డైరెక్ట్ చేసిన ది వ్యాక్సిన్ వార్ (the vaccine war) సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ అవ్వనుంది. అయితే.. ఈ సినిమాను సలార్ సినిమాతో పాటే రిలీజ్ చేయాలనుకున్నారు వివేక్. గతంలో కూడా ప్రభాస్ నటించిన రాధేశ్యాం (radhe shyam) సినిమా రిలీజ్ సమయంలోనే కశ్మీర్ ఫైల్స్ (kashmir files) సినిమాను రిలీజ్ చేసారు. అప్పట్లో రాధే శ్యాం ఫ్లాప్ అవగా కశ్మీర్ ఫైల్స్ సెన్సేషనల్ హిట్ అయింది.
దాంతో ప్రభాస్ సినిమాతో పాటు తన సినిమాను రిలీజ్ చేస్తే కచ్చితంగా హిట్ అవుతుందని అనుకున్నారు వివేక్. దాంతో ఈ ఏడాదిలో సలార్ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసినప్పుడే అదే రోజున ది వ్యాక్సిన్ వార్‌ను రిలీజ్ కూడా ప్రకటించారు. దాంతో ఫ్యాన్స్ చెడుగుడు ఆడేసారు. వివేక్‌ను నోటికొచ్చినట్లు తిడుతూ కామెంట్స్ చేసారు. మర్యాదగా సినిమాను పోస్ట్‌పోన్ చేసుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. తీరా చూస్తే సలార్ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ చివరికి 2024లో రిలీజ్ అవ్వాలని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
దీనిపై వివేక్ అగ్నహోత్రి మాట్లాడుతూ.. “” నన్ను తిట్టారు. పారిపో అన్నారు. సినిమాను పోస్ట్‌పోన్ చేసుకో అని బెదిరించారు. చివరికి ఎవరు పారిపోయారు? సలారే పారిపోయింది కదా..! ఫ్యాన్స్ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే.. నా సినిమా రూ.12 కోట్ల బడ్జెట్‌తో తీసినది. సలార్ రూ.300 కోట్ల బడ్జెట్. నేను ప్రభాస్ సినిమాతో ఎందుకు పోటీ పడతాను చెప్పండి. ఎప్పుడూ కూడా రెండు సినిమాలు ఒకే తేదీన రిలీజ్ అవుతున్నాయంటే ఫ్యాన్ వార్స్ క్రియేట్ చేయకూడదు“” అని తెలిపారు వివేక్. (prabhas)
అందుకే సలార్ పోస్ట్‌పోన్ అయ్యిందా?
ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన సలార్ సెప్టెంబర్ మొదటివారంలోనే రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల మూడు నాలుగు సార్లు వాయిదా వేసారు. చివరికి ఈ సినిమా అసలు 2023లోనే రిలీజ్ అవ్వదు అనేసారు. ఇందుకు కారణం సలార్ క్లైమాక్స్ సన్నివేశాలతో ప్రశాంత్ సంతృప్తికరంగా లేరట. అందుకే రీషూట్ చేయడానికి మరింత సమయం తీసుకుని 2024లో సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. (prabhas)