Prabhas: ఓటు హక్కు వినియోగించుకోని ప్ర‌భాస్.. కార‌ణం అదేనా?

Prabhas: నిన్న తెలంగాణ వ్యాప్తంగా జ‌రిగిన పోలింగ్‌లో దాదాపు సెల‌బ్రిటీలు అంద‌రూ త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. కానీ ప్ర‌భాస్ మాత్రం ఓటు వేయ‌లేదు. ఇందుకు కార‌ణం ఆయ‌న ఇటీవ‌ల అమెరికాకు వెళ్లి మోకాలికి స‌ర్జ‌రీ చేయించుకుని వ‌చ్చారు. దాంతో కొన్ని వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల‌ని వైద్యులు సూచించారు. ఈ కార‌ణంతోనే ఆయ‌న ఓటు వేయ‌డానికి రాలేక‌పోయిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌భాస్ న‌టించిన స‌లార్ (salaar trailer) సినిమా ట్రైల‌ర్ ఈరోజు రాత్రి 7:19 గంట‌ల‌కు రిలీజ్ కాబోతోంది.