Prabhas: మారుతి సినిమాలో క్యూట్​ లుక్స్​లో డార్లింగ్​.. ఫొటో లీక్​!

Hyderabad: యంగ్​ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ప్రాజెక్ట్ K(Project K), సలార్(Salaar), ఆదిపురుష్(Adipurush)​ వంటి వరుస పాన్​ ఇండియా ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్నారు. ఇక వీటితోపాటు డైరెక్టర్​ మారుతీ సినిమా షూటింగ్​లో కూడా పాల్గొంటున్నారు డార్లింగ్​. ప్రస్తుతం ప్రభాస్​ మారుతీ(Maruthi) సినిమా షూటింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన రిద్ది కుమార్ (Riddhi Kumar), నిధి అగర్వాల్ (Nidhi Agerwal), మాళవిక మోహనన్ (Malavika Mohanan) నటించబోతున్నట్లు వార్తలు వచినప్పటికీ, ఇప్పటి వరకు దీని పై చిత్ర యూనిట్ ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

ఈ సినిమా పూజ కార్యక్రమాలతో లాంచ్ కాకపోయినా సైలెంట్ గా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసేసుకుంటుంది. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక పాత థియేటర్ సెట్ కూడా వేయించారని టాక్​.  తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఫోటో లీక్ అయ్యింది. ఆ ఫొటోలో ప్రభాస్, రిద్ది జంటగా కనిపిస్తున్నారు. ఇక ప్రభాస్ అయితే గుబురు గడ్డంతో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ లుక్స్ ని చూసిన ప్రభాస్​ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఎటువంటి హడావుడి లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ ని అందించేలా ఉన్నాడు అంటూ మారుతీని పొగిడేస్తున్నారు.