Adipurush: ఐపీఎల్​ ఫైనల్స్​లో ‘జై శ్రీరామ్​’!

Ahmedabad: ఐపీఎల్​ 2023(IPL 2023) ఫైనల్​ మ్యాచ్​లో గుజరాత్​ టైటాన్స్(GT)​, చెన్నై సూపర్​ కింగ్స్​ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో CSK ఐదోసారి కప్​ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సందర్భంగా అహ్మదాబాద్​ స్టేడియంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఫైనల్​లో చెన్నై సూపర్​ కింగ్స్​ గెలవగానే స్టేడియంలోని అభిమానులంతా ‘జై శ్రీరామ్​’(Jai Shree Ram) అంటూ ఆదిపురుష్​లోని పాట పాడారు. ఈ వీడియోను స్వయంగా ఆదిపురుష్​ నిర్మాతల్లో ఒకరైన టీ సిరీస్(T-Series)​ ట్విట్టర్​లో షేర్​ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది.

పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్(Prabhas)​ రాముడిగా నటిస్తున్న ఆదిపురుష్(Adipurush)​ జూన్​ 16న విడుదల కానుంది. ఈ సినిమాను బాలీవుడ్​ డైరెక్టర్​ ఓం రౌత్​ రూపొందించారు. ఈ సినిమాలో కృతి సనన్​ సీతగా, సైఫ్​ అలీఖాన్​ రావణుడిగా కనిపించనున్నారు. కాగా, ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్​తోపాటు​, ‘జై శ్రీరామ్’​, ‘రామ్​ సీతా రామ్’​ పాటలు యూట్యూబ్​లో సెన్సేషన్​ క్రియేట్​ చేస్తున్నాయి. తాజాగా విడుదలైన రామ్​ సీతా రామ్​ పాట ట్రెండింగ్​ 1లో కొనసాగుతోంది. ‘జై శ్రీరామ్​’