ప్రభాస్‌కి సందీప్ రెడ్డి వంగా షరతు
Prabhas: రెబెల్ స్టార్ ప్రభాస్.. డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. దీనికి స్పిరిట్ అనే టైటిల్‌ని పెట్టారు. అయితే.. ఈ సినిమా కోసం సందీప్ ప్రభాస్‌కి ఓ కండీషన్ పెట్టాడట. అదేంటంటే.. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ లుక్ చాలా కొత్తగా ఉండబోతోందట. ఈ లుక్ వచ్చాక ప్రభాస్ ఇక బయట కనిపించడం కానీ.. వేరే సినిమాలు ఒప్పుకోవడం కానీ చేయకూడదని సందీప్ కండీషన్ పెట్టాడట. ఇందుకు ప్రభాస్ కూడా వెంటనే ఒప్పుకున్నాడు. ప్రస్తుతానికైతే స్పిరిట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2025 లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. నిజానికి షూటింగ్ ఈ నెల నుంచే మొదలవ్వాలి. కానీ ప్రభాస్‌ని కొత్త లుక్‌లో చూపించేందుకు షూటింగ్ కాస్త పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఈ గ్యాప్‌లో ప్రభాస్ మారుతి డైరెక్షన్లో వస్తున్న ది రాజా సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేసేస్తారు.