Prabhas: మరో సినిమా ఓకే చేసిన రెబల్​ స్టార్!

Hyderabad: బాహుబలి(Bahubali) తర్వాత వరుస పాన్​ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు యంగ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్​(Prabhas). వరుస సినిమాలను లైన్లో పెట్టిన ప్రభాస్​ మరో సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్​ నటించిన ఆదిపురుష్(Adipurush)​ జూన్​ 16న రిలీజ్​ కానుంది. బాలీవుడ్​ డైరెక్టర్​ ఓం రౌత్(Om Raut)​ ఈ సినిమాను తెరకెక్కించారు. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్​ రాముడిగా, కృతి సనన్(Kriti Sanon)​ సీతగా, సైఫ్​ అలీఖాన్​(saif ali khan) రావణుడిగా నటించారు. ట్రైలర్​తో ఆకట్టుకున్న ఈసినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్​ ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్​, నాగ్​ అశ్విన్​ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్​ కెతో పాటు మారుతి డైరెక్షన్లోనూ ఓ సినిమా చేస్తున్నారు. కాగా, తాజాగా ప్రభాస్​ మరో సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది.

సీతారామం(Sitaramam) సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్​ హను రాఘవపూడి(Hanu Raghavapudi). మాస్​, యాక్షన్​ థ్రిల్లర్ల కాలంలోనూ ఓ క్లాసిక్​ లవ్​ స్టోరీతో ప్రేక్షకులను ఆకట్టుకుని ఘన విజయం అందుకున్నారు. మలయాళ స్టార్​ హీరో దుల్కర్​ సల్మాన్​, బాలీవుడ్​ బ్యూటీ మృణాల్​ ఠాకూర్​ జంటగా వచ్చిన ఈ సినిమా ఓ క్లాసిక్​ లవ్​ స్టోరీగా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. కాగా, ఇప్పుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్​ ఓ సినిమా చేయనున్నారు. అయితే ప్రభాస్​కి లవ్​ స్టోరీలు అంతగా కలిసి రావట్లేదు. రాధేశ్యామ్​తో డిజాస్టర్​ని మూటగట్టుకున్న ప్రభాస్​ లవ్​ స్టోరీ చేయకపోవడమే మంచిదని భావిస్తున్నారు అభిమానులు. అయితే హను ప్రభాస్​ కోసం ఓ థ్రిల్లర్​ కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించబోతున్నారు. మరి ఈ సినిమాతో డార్లింగ్​ అభిమానులను ఎలా మెప్పిస్తారో చూడాలి.