Pawan Kalyan: మరో మేనల్లుడితో ప‌వ‌ర్‌స్టార్ సినిమా!

Hyderabad: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే సముద్రఖని(Samuthirakani) దర్శకత్వంలో రూపొందుతున్న వినోదయా సిత్తం(Vinodhaya Sitham ) రీమేక్​ షూటింగ్​ పూర్తిచేసుకున్న పవన్​ ఏమాత్రం గ్యాప్​ లేకుండా ఉస్తాద్​ భగత్​సింగ్(Ustaad Bhagat Singh)​, ఓజీ (OG)షూటింగ్స్​ని షురూ చేసేశారు. అయితే క్రిష్(Krish) దర్శకత్వంలో ఎప్పుడో మొదలైన ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది. ఇలా ఇన్ని సినిమాలు సెట్స్‌పై ఉండగానే ఆయన తాజాగా మరో ప్రాజెక్ట్‌కు సైన్ చేసినట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా ‘రావణాసుర’తో బాక్సాఫీస్ వద్ద్ ఫ్లాప్ ఎదుర్కొన్న సుధీర్ వర్మ (Sudheer Varma)తో సినిమా చేయనున్నారట పవన్​. ఈ చిత్రాన్ని కూడా పవన్​ స్నేహితుడు, ప్రముఖ డైరెక్టర్​ త్రివిక్రమ్​ ఫైనల్​ చేశారని టాక్​.

పవన్ కళ్యాణ్ కొత్త చిత్రాలను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ఎంపిక చేస్తున్న విషయం తెలిసిందే. గతేడాది సాగర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ రీమేక్‌‌కు‌ స్క్రీన్‌ప్లే, మాటలు త్రివిక్రమ్ అందించారు. అలాగే సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే, పవన్ తాజాగా సైన్ చేసిన ప్రాజెక్ట్‌కు సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈ మూవీని కూడా త్రివిక్రమ్​ స్వయంగా పవన్​కి సజెస్ట్​ చేశారట. ఈ సినిమాకి కూడా కథ,​ స్క్రీన్​ప్లే, మాటలు త్రివిక్రమ్​ అందించనున్నారట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుందని టాక్. అయితే. ఈ సినిమా మల్టీస్టారర్​ అనీ, మరో హీరో పాత్రలో పవన్ కల్యాణ్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) నటిస్తాడని టాలీవుడ్​ టాక్​.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ఇప్పటికే వినోదయా సిత్తంలో సాయి ధరమ్​ తేజ్​తో,​ ఈ సినిమాతో వైష్ణవ్​ తేజ్​తో కలిసి ఫ్యాన్స్​కి డబుల్​ ట్రీట్​ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​.