Saindhav on OTT: వెంక‌టేష్ కొత్త సినిమాకు షాకింగ్ రెస్పాన్స్!

Saindhav on OTT: విక్ట‌రీ వెంక‌టేష్ (venkatesh daggubati) న‌టించిన సైంధ‌వ్ సినిమాకు OTTలో షాకింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. సంక్రాంతి సంద‌ర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డీలా ప‌డిపోయింది. స‌రే క‌నీసం OTTలో అయినా పుంజుకుంటుందేమో అనుకుంటే అదీ లేదు. ఈ సినిమా అమెజాన్ ప్రైంలో (amazon prime) అందుబాటులో ఉంది.

డైరెక్ట‌ర్‌పై విమ‌ర్శలు

తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల్లో స‌బ్ టైటిల్స్‌తో స‌హా అందుబాటులోకి వ‌చ్చింది. అద్భుత‌మైన న‌టులు, మంచి క‌థ ఉన్న‌ప్ప‌టికీ స‌రిగ్గా వాడుకోలేక‌పోయార‌ని ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌నుపై వెంకీ మామ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సినిమా మొద‌లైన 20 నిమిషాల‌కే వ్యూయ‌ర్స్ మూసేస్తున్నార‌ట‌.

అస‌లు సినిమా ఎందుకు తీసిన‌ట్లు?

ఈ సినిమా వెంక‌టేష్ త‌న కూతురిని ఎలా కాపాడుకుంటాడు అనే నేప‌థ్యంలో థ్రిల్ల‌ర్ జోన‌ర్‌తో తీసారు శైలేష్ కొల‌ను. ఫ‌స్ట్ హాఫ్ ఫ‌ర్వాలేదు అనిపించిన‌ప్ప‌టికీ క‌నీసం సెకండ్ హాఫ్ బాగుంటుందేమో అనుకున్నారు ఆడియ‌న్స్. వెంక‌టేష్ సినిమా మొత్తం క‌ష్ట‌ప‌డిన‌ప్ప‌టికీ కూతురిని కాపాడుకోలేక‌పోవ‌డంతో ప్రేక్ష‌కులు అప్సెట్ అయ్యారు. అస‌లు ఈ సినిమాను ఎందుకు తీసారో కూడా అర్థంకావ‌డంలేదు అని వారు మండిప‌డుతున్నారు.