సర్వైకల్ క్యాన్సర్‌తో హఠాన్మరణం రాదట.. మరి పూనమ్ పాండే ఎలా చనిపోయారు?
ప్రముఖ మోడల్, నటి పూనమ్ పాండే (poonam pandey) మరణ వార్త యావత్ భారతదేశాన్ని షాక్‌కు గురిచేసింది. వివాదాస్పద అంశాల వల్ల ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉండే పూనమ్.. కొంతకాలంగా సర్వైకల్ క్యాన్సర్ (గర్భకోశ క్యాన్సర్)తో బాధపడుతున్నారని.. ఆమె గురువారం రాత్రి తన స్వస్థలం అయిన ఉత్తర్‌ప్రదేశ్‌లో కన్నుమూసారని ఆమె మేనేజర్ ప్రకటించారు. అయితే పూనమ్ చనిపోయినట్లు ఆమె కుటుంబ సభ్యుల నుంచి తెలిసింది కానీ అందులో ఎంత వాస్తవం ఉందనేది కూడా తెలియాల్సి ఉందని అన్నారు.
అయితే క్యాన్సర్‌తో బాధపడుతున్న పూనమ్ ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలు ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారని ఎప్పుడూ కూడా ఆమె క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు అనిపించలేదని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. పైగా నాలుగు రోజుల క్రితం గోవాలో తెగ ఎంజాయ్ చేసిన పూనమ్ ఉన్నట్టుండి క్యాన్సర్‌తో చనిపోయారంటే ఎలా నమ్మాలి అని ప్రశ్నిస్తున్నారు. పూనమ్ విషయంలో ఏదో అనుమానం ఉందని.. గర్భకోశ క్యాన్సర్ ఉన్నవారు హఠాన్మరణం చెందరని.. ఒకవేళ పూనమ్ మరణ వార్త నిజమే అయితే ఈ అంశంలో పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు పూనమ్ పాండే చనిపోయినట్లు ఆమె టీంకు వెల్లడించిన పూనమ్ కుటుంబ సభ్యులు ఉన్నట్టుండి కనిపించకుండా పోయారు. వారిని స్థానిక పోలీసులు, మీడియా వర్గాలు రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.