Pooja Hegde: మా అమ్మాయికి ఎలాంటి వరుడు కావాలంటే..
Hyderabad: సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) బాలీవుడ్(Bollywood) లోనూ సినిమాలు చేస్తోంది. ఇటీవల బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాలో నటించింది బుట్ట బొమ్మ. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో పూజా కెరీర్ అయిపోయిందని విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. బాలీవుడ్‌లో ఒకటి, మహేష్ బాబు (Mahesh Babu) – త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా మరొకటి.
ఆదివారం మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని పూజ తన తల్లి లతా హెగ్డేతో కలిసి ఓ బాలీవుడ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తల్లీ కూతుళ్లు అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పూజాకు ఎలాంటి భర్త కావాలి అని అడగిన ప్రశ్నకు ఆమె తల్లి లత సమాధానమిచ్చారు. ‘తనని అన్ని రకాలుగా అర్ధం చేసుకునే వ్యక్తి గురించి ఎదురు చూస్తోంది. వివాహబంధం కలకాలం నిలిచి ఉండాలంటే భార్య, భర్త ఇద్దరూ ఒకే అభిప్రాయంతో ఉండాలి. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. పూజా మనసు చాలా సున్నితమైనది. తనకు సంబంధించిన ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకునే వ్యక్తి కావాలి. తన కెరీర్ కి కూడా సపోర్ట్ గా నిలబడాలి. అలాంటి అబ్బాయినే పూజా కోరుకుంటోంది’ అని తెలిపారు లతా. మరి పూజా హెగ్డేని చేసుకోబోయే ఆ వరుడు ఎవరో చూడాలి. ఇక ఇదే ఇంటర్వ్యూలో పూజ తల్లితో ఉన్న అనుబంధాన్ని పంచుకుంది. చిన్ననాటి జ్ఞాపకాలను కూడా షేర్ చేసుకుంది.