Pooja Hegde: సల్మాన్‌తో డేటింగ్.. ఏం చెప్పగలను
Mumbai: టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్(Bollywwod)లోనూ రాణిస్తున్న హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde). కెరీర్ మొదట్లో వరుస హిట్లతో స్టార్ హీరోయిన్గా ఎదిగిన పూజ కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. ప్రస్తుతం పూజ సల్మాన్ ఖాన్(Salman Khan) హీరోగా రూపొందుతున్న కిసీ కా భాయ్ కిసీ కా జాన్(Kisi Ka Bhai Kisi ka Jaan) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మొదలైనప్పటినుంచీ పూజ సల్మాన్‌తో ప్రేమలో ఉందంటూ పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
తాజాగా ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజ తనపై వస్తున్న రూమర్స్‌పై మాట్లాడారు. ‘ఏం చెప్పాలో తెలియట్లేదు. అసలు ఇలాంటివి ఎలా వస్తాయో తెలీదు. నేను ఎవరితోనూ ప్రేమలోగానీ, రిలేషన్లోగానీ లేను. సింగిల్‌గానే ఉన్నాను. అలా ఉండటానికే ఇష్టపడతాను. ప్రస్తుతం నా దృష్టి మొత్తం కెరీర్‌పైనే ఉంది. షూటింగ్‌లతో బిజీబిజీగా తిరుగుతూనే ఉన్నాను. ఈ పుకార్లకు సమాధానమిస్తూ కూర్చోలేను. నిజానికి ఈ సినిమా లాక్డౌన్ టైమ్‌లోనే నా దగ్గరకు వచ్చింది. నేను ఇంతకముందు హౌస్ఫుల్కి కలిసి పనిచేసిన సాజిద్ నడియాడ్‌వాలా ఇందులోనూ భాగం కావడంతో ఒప్పుకున్నా. ఈ సినిమా కథ నచ్చింది. మొహంజదారో సినిమా సమయంలో సల్మాన్ సార్ కలిసి మనం ఏదైనా సినిమా చేద్దాం అన్నారు. ఈ సినిమాలో తెలుగు అమ్మాయి పాత్రకు నేను సరిపోతానని నన్ను తీసుకున్నారు. ఎందుకంటే ఇలాంటి పాత్రలు టాలీవుడ్లో నేను చాలా చేశాను. అంతేకాని అందరూ అనుకున్నట్లు నేను ఎవరితోనూ ప్రేమలో లేను. ఇలాంటి రూమర్స్ వస్తుంటే నేను మాత్రం ఏం చెప్పగలను?’ అంటూ తనపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టారు పూజ.
ఇక కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా హిందీతోపాటు తెలుగులోనూ రూపొందుతోంది. విక్టరీ వెంకటేష్(Venkatesh) కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు.