2024 Elections: ఎన్నికల వేళ పొలిటికల్ “షో”
మరో సంవత్సరంలో ఎన్నికలు రానున్న సందర్భంలో రాజకీయ సంఘటనలు, స్వాతంత్య్ర సమరయోధుల జీవితకథలే ఇతివృత్తంగా పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అవేంటంటే..
ఎమర్జెన్సీ
స్వాతంత్య్ర భారతాన్ని కుదిపేసిన అత్యవసర పరిస్థితి సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆ సమయంలో ప్రధానమంత్రిగా అధికారంలో ఉన్న ఇందిరా గాంధీ పాత్రను బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ పోషిస్తోంది. అంతేకాదు ఈ సినిమాకు కథను కూడా కంగనానే అందిస్తోంది. అనుపమ్ ఖేర్, మిలింద్ సోమన్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.
మై అటల్ హూ
దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వాజ్‌పేయిగా పంకజ్ త్రిపాఠి నటిస్తున్నారు. ఈ సినిమాను రవి జాదవ్ రూపొందిస్తున్నారు.
సామ్ బహదూర్
ఈ సినిమా ఇండియన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ సామ్ మాణిక్షా జీవిత ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. 1971 ఇండో పాకిస్థాన్ వార్ సమయంలో ఈయన విధులు నిర్వహించారు. ఫీల్డ్ మార్షల్‌గా ప్రమోట్ అయిన మొట్టమొదటి ఇండియన్ ఆర్మీ ఆఫీసర్. టైటిల్ రోల్లో విక్కీ కౌశల్ నటిస్తున్నాడు.
స్వతంత్ర వీర్ సావర్కర్
ఈ సినిమా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడైన వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితం ఆధారంగా రూపొందుతోంది. ఈ సినిమాని మహేష్ మంజ్రేకర్ తెరకెక్కిస్తున్నారు. రణదీప్ హుడా టైటిల్ రోల్లో నటిస్తుండగా, అంకిత్ లోఖండే, అమిత్ సియల్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.
ఇవేకాకుండా, దక్షిణాదిలోనూ పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. కమల్ హాసన్ ఇండియన్2, రాంచరణ్ గేమ్ ఛేంజర్, పవన్ కల్యాణ్, బాలకృష్ణ కూడా రాజకీయాలకు సంబంధించిన అంశాలు తమ సినిమాల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌గా వచ్చిన యాత్ర సినిమాకు కూడా సీక్వెల్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారని ఇండస్ట్రీ టాక్.