Pokiri: వేరే టైటిల్ అనుకున్నారట.. అట్టర్ ఫ్లాప్ అయ్యేది!
Pokiri: మహేష్ బాబు (Mahesh Babu) కెరీర్‌లో ల్యాండ్ మార్క్‌గా నిలిచిపోయిన సినిమా ఏదన్నా ఉందంటే అది పోకిరి. సినిమా తీసిన పూరి జగన్నాథ్‌కు..(Puri Jagannath) హీరోయిన్‌గా నటించిన ఇలియానాకు (Ileana) కూడా ఈ సినిమా తెచ్చిపెట్టిన సక్సెస్ అంతా ఇంతా కాదు. రీ రిలీజ్‌ల ట్రెండ్ మొదలైంది కూడా ఈ సినిమాతోనే. ఇంతటి బ్లాక్ బస్టర్ సినిమాకు పూరీ జగన్నాథ్ పోకిరి కాకుండా వేరే టైటిల్ అనుకున్నారట.
ఆ టైటిల్ ఏంటో తెలుసా.. ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్య నారాయణ. ఆ తర్వాత ఎందుకో పోకిరి అని పెట్టాలని ఫిక్స్ అయ్యారు. ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్య నారాయణ అని పెట్టుంటే పోకిరి రేంజ్‌లో బ్లాక్ బస్టర్ అయ్యేది కానేకాదు. పైగా ఉత్తమ్ సింగ్ అనేది మన తెలుగు వారికి సూట్ కాని పేరు. అందులోనూ మహేష్ బాబుకు ఇలాంటి పేర్లు అస్సలు సెట్ కాదు.
ALSO READ: