PKSDT: ప‌వ‌ర్‌ఫుల్ ఎంట్రీ ఇచ్చేసాడు BRO..!

Hyderabad: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌(pawan kalyan), సాయి ధ‌ర‌మ్ తేజ్‌ల(sai dharam tej) కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమాకు టైటిల్(BRO) క‌న్ఫామ్ అయిపోయింది. స‌ముద్ర‌ఖ‌ని(samuthirakani) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు బ్రో(BRO) అనే టైటిల్ ఖ‌రారు చేసారు. ఈ సంద‌ర్భంగా టైటిల్ అనౌన్స్‌మెంట్‌, టీజ‌ర్‌ను టీం రిలీజ్ చేసింది. టీజ‌ర్‌లో శ్లోకాల మ‌ధ్య‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎంట్రీ ఇవ్వ‌డం హైలైట్‌గా నిలిచింది. ప‌వ‌న్ వేసుకున్న ష‌ర్ట్ మ‌ధ్య‌లో ఓం అని రాసుండ‌డం ఇంకా హైలైట్‌. దీనిని బ‌ట్టి చూస్తే ఇందులో ఆయ‌న దేవుడి క్యారెక్ట‌ర్‌లో నటిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక అంద‌రూ ఊహించిన‌ట్లుగానే త‌మ‌న్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో టీజ‌ర్‌ను వేరే లెవ‌ల్‌కు తీసుకెళ్లాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని థియేట‌ర్‌లో చూసేట‌ప్పుడు ఎలాంటి బీట్ వ‌స్తే ఫ్యాన్స్ క‌నెక్ట్ అవుతారో అలాంటి బీజీఎం దంచికొట్టాడు త‌మ‌న్. ఇప్ప‌టికే సినిమాకు సంబంధించిన చాలా మ‌టుకు షూటింగ్ అయిపోయింది. ప‌వ‌న్ అటు పాలిటిక్స్‌తో ఇటు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉండ‌టంతో ముందు ప‌వ‌న్‌, ధ‌ర‌మ్ తేజ్‌కు సంబంధించిన సీన్స్ షూట్ చేసేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక ఇందులో హీరోయిన్లుగా ఎవ‌రు న‌టిస్తున్నార‌న్న‌ది తెలియాల్సి ఉంది. త‌మిళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన వినోద‌య సీతం సినిమాకు ఇది రీమేక్‌గా రాబోతోంది.