“Jr ntr గురించి చెప్తే.. నోటికొచ్చిన‌ట్లు తిట్టారు”

Hyderabad: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్(jr ntr) గ్లోబ‌ల్ స్టార్ అవుతార‌ని చెప్పిన‌ప్పుడు త‌న‌ను నోటికొచ్చిన‌ట్లు తిట్టార‌ని అంటున్నారు న‌టి పాయ‌ల్ ఘోష్‌(payal ghosh). ఎన్టీఆర్(ntr), పాయ‌ల్(payal) ఊస‌ర‌వెల్లి సినిమాలో న‌టించారు. అందులో హీరోయిన్ త‌మ‌న్నా(tamannah) ఫ్రెండ్ పాత్ర‌లో న‌టించిన‌ప్ప‌టికీ తార‌క్‌తో రెండు మూడు సీన్ల‌లో పాయ‌ల్ క‌నిపిస్తారు. అయితే.. ఎన్టీఆర్ అంటే త‌న‌కు ఎంతో అభిమాన‌మ‌ని ఎప్ప‌టినుంచో పాయ‌ల్ చెప్తున్నారు. మొన్న RRRకు ఆస్కార్ వ‌చ్చిన‌ప్పుడు కూడా తార‌క్ గురించి ట్వీట్ చేస్తూ.. “ఎన్టీఆర్ గ్లోబ‌ల్ స్టార్ అవుతార‌ని ఎప్ప‌టినుంచో చెప్తున్నాను. నేను చెప్పిందే నిజం అయ్యింది” అని అన్నారు.

మ‌ళ్లీ ఈరోజు కూడా ఇదే విష‌య‌మై ట్వీట్ చేసారు. “ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతారు అన్న‌ప్పుడు న‌న్ను చాలా మంది అలా అన్నందుకు నోటికొచ్చిన‌ట్లు తిట్టారు. ఇప్పుడు చూడండి. ఆరు నెల‌ల్లోనే ఎన్టీఆర్ గ్లోబ‌ల్ స్టార్ అయ్యాడు” అని అన్నారు. అఫ్‌కోర్స్ పాయ‌ల్ పాపులారిటీ కోస‌మే మాటిమాటికీ తార‌క్‌ను ట్యాగ్ చేస్తూ ఇలాంటివి పెడుతుంటారని ప‌లువురు కామెంట్స్ చేస్తున్నారు. అస‌లు ఎందుకు ట్వీట్ చేస్తున్నారో సంద‌ర్భం ఏంటో కూడా చెప్ప‌కుండా ప‌దే ప‌దే తార‌క్‌ను ట్యాగ్ చేయ‌డం వ‌ల్ల త‌నకు సినిమాలో ఛాన్సులు రావన్న విష‌యం పాయ‌ల్ కూడా గుర్తించాలి.