Nymphomania: విపరీత శృంగార కోరికలు.. మంగళవారం సినిమా దీని గురించే..!
Nymphomania: నటి పాయల్ రాజ్‌పుత్ (payal rajput) మంగళవారం (mangalavaram) లాంటి మరో బోల్డ్ సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా తెలుగులో పాపులర్ అయిపోయారు పాయల్. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ మంగళవారం వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాను ఓకే చేసి ధైర్యం చేసారు. ఆర్ఎక్స్ 100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి (ajay bhupathi) ఈ సినిమాను తెరకెక్కించారు. మంగళవారం సినిమాలో పాయల్ నిమ్ఫోమేనియా అనే వ్యాధితో బాధపడుతుంటారు. అసలు ఈ వ్యాధి ఏంటి? ఎవరికి వస్తుంది? వంటి విషయాలు తెలుసుకుందాం.
నిమ్ఫోమేనియా అంటే హైపర్ సెక్సువాలిటీ. సింపుల్‌గా చెప్పాలంటే ఆడవారిలో విపరీతమైన శృంగార కోరికలు ఉంటే వారికి ఈ నిమ్ఫోమేనియా ఉన్నట్లు అర్థం. దీనిని మానసిక రుగ్మతగా చూస్తున్నారు. ఈ రుగ్మత ఉన్నవారికి 24 గంటలూ సెక్స్ గురించే ఆలోచనలు వస్తుంటాయి. ఈ రుగ్మత మగవారిలో కూడా ఉంటుందట. పార్కిన్సన్స్ వ్యాధి ఉన్నవారికి ఇచ్చే మందుల కారణంగా కూడా ఈ నిమ్ఫోమేనియా వస్తుందని వైద్యులు చెప్తున్నారు.
ఇలాంటి ఒక రుగ్మతను 19వ శతాబ్దంలో కనుగొన్నారు. ఈ రుగ్మత ఉన్నవారికి అనేక మందితో సెక్స్ చేయాలని ఉంటుంది. ఆలోచనలు కూడా శృంగారం గురించే ఉంటాయి. ఫలితంగా ఆ వ్యక్తి తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. కానీ ఈ రుగ్మత గురించి ఎవ్వరితోనూ చెప్పుకోలేరు. ఇప్పుడున్న కాలంలో ఇలాంటి ఒక రుగ్మత గురించి చెప్తే కామాంధులు అన్నట్లుగానే భావిస్తారు. అందుకే ఈ రుగ్మతతో బాధపడేవారు అందరి దృష్టిలో చెడ్డవారిగా మిగిలిపోతుంటారు.