Payal Ghosh: షమీకి రెండో భార్యనవుతా అంటున్న ఊసరవెల్లి నటి
Payal Ghosh: క్రికెటర్ మహమ్మద్ షమీని (mohammed shami) పెళ్లి చేసుకుంటానని అంటున్నారు ఊసరవెళ్లి, ప్రయాణం నటి పాయల్ ఘోష్. సినిమాల్లేక ఏదో ఒక రకంగా ట్విటర్‌లో ట్వీట్స్ చేస్తూ పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తుంటారు పాయల్. ఈ క్రమంలోనే ఈసారి షమీని టార్గెట్ చేసారు. వరల్డ్ కప్ (world cup 2023) జరుగుతున్న క్రమంలో షమీ నాలుగు ఆటల్లో 16 వికెట్లు తీసి మంచి ఫాంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో పాయల్ షమీని పెళ్లి చేసుకుంటానని అన్నారు. కాకపోతే చిన్న కండీషన్ పెట్టారు. షమీ ఇంగ్లీష్ స్కిల్స్ మెరుగుపరుచుకుంటే ఇప్పటికిప్పుడే పెళ్లి చేసుకోడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
పాయల్ ఘోష్ ఎప్పుడూ కూడా NTR గురించి ట్వీట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఊసరవెల్లి (oosaravelli) సినిమాలో తమన్నా ఫ్రెండ్ క్యారెక్టర్‌లో నటించిన పాయల్ ఇప్పుడు సినిమాలు లేక ఏదో ఒక అవకాశం రాకపోదా అని తారక్‌ను ట్యాగ్ చేస్తూ ఏదో ఒక ట్వీట్ పెడుతూ ఉంటారు. RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు కూడా తారక్ గ్లోబల్ స్టార్ అవుతాడని నేను ఎప్పుడో చెప్పా అంటూ కామెంట్ చేసారు.