Payal Ghosh: ఇజ్రాయెల్‌ని చూసి భారత్ ఎంతో నేర్చుకోవాలి
Payal Ghosh: ఇజ్రాయెల్‌ని చూసి భారత్ ఎంతో నేర్చుకోవాలంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది నటి పాయల్ ఘోష్. రాఫా సరిహద్దుపై ఇజ్రాయెల్ మెరుపు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆమె ఈ విధంగా ట్వీట్ చేసింది. “” భారతీయుల రక్తం ఎంత చల్లబడిపోయిందంటే.. ఎవరైనా వాళ్ల అమ్మ, అక్కచెల్లెళ్లను తక్కువ చేసి మాట్లాడుతున్నా కూడా అలా చూస్తూ ఉండిపోతారు. ఇజ్రాయెల్ చేస్తోంది కరెక్ట్. ఎవరైనా మనల్ని ఒకటి కొడితే మనం వాడిని 10 సార్లు కొట్టాలి. అదే ఇప్పుడు కరెక్ట్. ఇండియా ఇజ్రాయెల్‌ని చూసి ఎంతో నేర్చుకోవాలి. ఇండియాపై ఏ దేశం ఎన్ని దాడులు చేసినా తనని తాను కాపాడుకోలేని దుస్థితిలో ఉంది“” అని ట్వీట్ చేసింది. ఎంతో మంది సినీ ప్రముఖులు రాఫాకు మద్దతు తెలుపుతున్నారు. కానీ ఇజ్రాయెల్ చేస్తున్నది వంద శాతం కరెక్ట్ అని ట్వీట్ పెట్టిన ఏకైక నటి పాయలే.