Payal Ghosh: సినిమాలు కావాలంటే పడుకోవాలి
Hyderabad: సినిమాల్లో అవకాశాలు రావాలంటే పడుకోవాలి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు పాయల్ ఘోష్ (payal ghosh). తెలుగులో ఊసరవెల్లి, ప్రయాణం సినిమాల్లో నటించిన పాయల్‌కి ఇక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు. అలాగని బాలీవుడ్‌లోనూ ఆమె చేసిన సినిమాలు ఎక్కువ ఏమీ లేవు. అయితే ఇప్పుడు తన 11వ సినిమాను అనౌన్స్ చేసారు పాయల్. అయితే నార్మల్‌గా అనౌన్స్ చేయకుండా పెద్ద సినిమాల్లో ఛాన్సులు రావాలంటే పడుకోవాల్సిందే లేకపోతే రావు అని పోస్ట్ పెట్టింది. “నా 11వ సినిమా విత్ ది ఫైర్ ఆఫ్ లవ్: రెడ్ షూటింగ్ పూర్తవుతోంది. నేను పడుకునేదాన్నే అయితే ఈపాటికి నాకు ఇది 30వ సినిమా అయ్యేది“ అని పోస్ట్ పెట్టారు. దాంతో చాలా మంది ఫ్యాన్స్ మీరు ఏం మాట్లాడుతున్నారు మేడం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
కొన్ని నెలల క్రితం డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ (anurag kashyap) తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని కూడా తీవ్ర ఆరోపణలు చేసారు పాయల్ (payal ghosh). తెలుగులో ఎన్టీఆర్ (jr ntr), మనోజ్ (manchu manoj) లాంటి యాక్టర్స్‌తో నటించానని, మంచి డైరెక్టర్స్ ప్రొడ్యూసర్లతోనూ నటించానని వారెవ్వరితో లేని ఇబ్బంది బాలీవుడ్‌కి వెళ్లాక వచ్చిందని అన్నారు. ఇక ట్విటర్‌లో పాయల్ పదే పదే NTR గురించి ప్రస్తావిస్తూ పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారు.