Payal Ghosh: ఆ తెలుగు నటుడు నన్ను కనీసం తాకలేదు
Payal Ghosh: నటి పాయల్ ఘోష్ ఏదో ఒక వంకతో సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని స్టంట్స్ చేస్తుంటుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ (JR NTR) గురించి లేదా టాలీవుడ్ గురించి పాజిటివ్‌గా ట్వీట్ చేయడం.. లేదంటే బాలీవుడ్ గురించి చెడుగా కామెంట్స్ చేయడం. పాయల్‌కు ఇది బాగా అలవాటైపోయింది.
కానీ ఎన్టీఆర్ గురించి తెలిసిందేగా. అది ఎంతో సీరియస్ మ్యాటర్ అయితే తప్ప అస్సలు పట్టించుకోడు. అసలు ఇలాంటి హీరోయిన్స్ గురించి ఆయనకు ఆలోచించే తీరిక కూడా ఉండదు. అప్పుడెప్పుడో వచ్చిన ఊసరవెల్లి (Oosaravelli) సినిమాలో ఎన్టీఆర్‌కి ఫ్రెండ్‌గా నటించినందుకు ఎప్పుడూ ఎన్టీఆర్ గురించి ట్వీట్స్ చేస్తూ ఎలాగోలా టాలీవుడ్ దర్శకుల ఫోకస్ తనపై పడాలని తెగ ట్రై చేసేస్తోంది. అసలు ఎన్టీఆర్‌కి ఈ పాయల్ ఘోష్ అనే హీరోయిన్ ఒకరు ఉన్నారని కూడా గుర్తుండి ఉండదు. గుర్తుపెట్టుకోవడానికి ఈమె పెద్ద హీరోయిన్ కాదు. ఊసరవెల్లి తారక్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమా కూడా కాదు.
ALSO READ: Payal Ghosh: “ఇక్కడెందుకు దుస్తులు మార్చుకుంటున్నావ్ అని తారక్ తిట్టారు”
ఇప్పుడు పాయల్ చేసిన లేటెస్ట్ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఓ తెలుగు నటుడితో తాను డేటింగ్‌లో ఉన్నప్పుడు అతను సెక్స్ కావాలని అడిగితే వద్దు అని చెప్పేసిందట. వద్దు అని చెప్పిన తర్వాత అతను కనీసం తనను తాకను కూడా తాకలేదని.. తెలుగు నటుల గురించి ఇంత కంటే ఇంకేం చెప్పగలం అని ట్వీట్ చేసింది.
అయితే ఆ తెలుగు నటుడు ఎవరు అని మాత్రం వివరాలు వెల్లడించలేదు. ఊసరవెల్లి సినిమాతో పాటు మంచు మనోజ్‌తో కలిసి ప్రయాణం సినిమాలో నటించింది పాయల్ ఘోష్. ఆ తర్వాత పలు హిందీ సినిమాలు, పాటల్లో నటిస్తూ వస్తోంది. కానీ ఆమె ఫోకస్ మాత్రం టాలీవుడ్ పైనే ఉంది. వివాదాస్పద ట్వీట్స్ చేస్తే ఎవరో ఒకరు చూసి గుర్తుపట్టి ఛాన్స్ ఇవ్వకపోరా అని పాపం ఆమె ప్రయత్నాలు ఆమె చేసుకుంటోంది.
క్రికెటర్లనూ వదల్లేదు
సినిమా వాళ్ల గురించే కాదు.. క్రికెటర్లపై కూడా వివాదాస్పద ట్వీట్స్ చేస్తూ ఉంటుంది పాయల్. ఇటీవల ప్రముఖ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. గతంలో గౌతమ్ గంభీర్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌లు (Akshay Kumar) తనకు లైన్ వేసారని.. కానీ తను మాత్రం ఇర్ఫాన్ పఠాన్‌నే నిజాయతీగా ప్రేమించానని ట్వీట్‌లో పేర్కొంది. తాను ఇర్ఫాన్ ఐదేళ్ల పాటు ప్రేమించుకున్నామని కానీ ఇర్ఫాన్ తనను మోసం చేసి వేరే నటిని పెళ్లి చేసుకున్నాడని తెలిపింది.
గౌతమ్ గంభీర్ తనకు మాటి మాటికీ కాల్స్ చేస్తుంటే ఇర్ఫాన్ రోజూ తన ఫోన్ లిస్ట్ చెక్ చేసేవాడని ఈ విషయం హార్దిక్ పాండ్య, కృణాల్ పాండ్యలకు కూడా తెలుసని పేర్కొంది. పాయల్ ఇంతటితో ఆగలేదు.. తాను ఇర్ఫాన్ కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేసింది. పైగా ఇర్ఫాన్ ఇప్పటికైనా నోరు విప్పాలని డిమాండ్ చేస్తోంది. దాంతో ఇర్ఫాన్, గంభీర్ ఫ్యాన్స్ ఆమెను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇర్ఫాన్ వల్ల తను డిప్రెషన్‌లోకి వెళ్లాలని సినిమాలు కూడా చేయలేకపోయానని తెలిపింది. ఇప్పటికీ డిప్రెషన్ మందులు వాడుతున్నానని తన గురించి తప్పుగా మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదని మండిపడుతోంది పాయల్.