pawan kalyan: సెట్‌లో ప‌వ‌న్‌..OG అని ఊరికే అన్నారా!

Hyderabad: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్(pawan kalyan) ప్ర‌స్తుతం ఓజీ(og) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ముంబైలో జ‌రుగుతోంది. సాహో ఫేం సుజీత్(sujeeth) సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. షూటింగ్‌లో భాగంగా ప‌వ‌న్(pawan) త‌న క్యార‌వాన్ ద‌గ్గ‌ర స్టైల్‌గా నిల‌బ‌డి ఫోన్ మాట్లాడుతున్న ఫొటో ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది. అది సోష‌ల్‌మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఆయ‌న క్యాజువ‌ల్‌గా నిల‌బ‌డి ఫోన్ మాట్లాడుతుంటేనే ఫ్యాన్స్ చొక్కాలు చించేసుకుంటున్నారు.. ఇక సినిమాలో గ్యాంగ్‌స్ట‌ర్‌లా ఫైట్స్ చేస్తుంటే ఆ ర‌చ్చ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే గూస్‌బంప్స్ వ‌స్తున్నాయ‌ని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక‌పోతే ఈ సినిమాలో త‌మిళ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహ‌న్‌ను హీరోయిన్‌గా ఫైన‌లైజ్ చేసింది టీం. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.