Pawan Kalyan: ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ప‌వ‌న్, శంక‌ర్ కాంబో?

Hyderabad: డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో (shankar) క‌లిసి ప‌నిచేయాల‌ని కోరుకోని న‌టుడు ఉండ‌డు. ప్ర‌స్తుతం మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో (ram charan) గేమ్ ఛేంజ‌ర్ (game changer) సినిమాతో బిజీగా ఉన్న శంక‌ర్… చ‌ర‌ణ్ బాబాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్  (pawan kalyan)కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ ప‌వ‌న్ ఈ సినిమాకు ఒప్పుకుంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు (ap elections) అయ్యాక శంక‌ర్‌కు డేట్స్ ఇస్తార‌ని టాక్ న‌డుస్తోంది. ఇప్ప‌టికే వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ ఫాస్ట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసి ఎన్నిక‌ల‌పైనే ఫోక‌స్ చేయాల‌ని అనుకుంటున్నారు. అస‌లు ప‌వ‌న్ సినిమాలు చేసేదే జ‌న‌సేన పార్టీని న‌డిపించ‌డం కోసం. ఒకవేళ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పార్టీ గెలిస్తే ఆయ‌న ఎమ్మెల్యేగా ఉంటారా? లేక ఏపీ సీఎం అవుతారా? అన్న‌ది ఇంకా తేల‌లేదు. ఒక‌వేళ ఎమ్మెల్యేగా ఉంటే TDP నేత బాల‌కృష్ణ (balakrishna) లాగా అటు రాజ‌కీయాలు, ఇటు సినిమాల‌తో బిజీగా ఉంటారేమో అన్న వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా ప‌వ‌న్ శంక‌ర్ కాంబినేష‌న్ కోసం ఫ్యాన్స్ కూడా వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. మ‌రి దీనికి వ‌ప‌న్ ఏమంటారో వేచి చూడాలి.