BRO డబ్బింగ్ మొద‌లెట్టేసారు!

Hyderabad: ఎన్నిక‌ల ప్ర‌చారాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్రో (bro) సినిమాకు డ‌బ్బింగ్ మొద‌లెట్టేసారు. డైరెక్ట‌ర్ స‌ముద్ర‌ఖ‌ని (samuthirakani) ప‌క్క‌నుంచి డ‌బ్బింగ్ ప‌నులు చూసుకుంటున్నారు. ప‌వ‌న్ డ‌బ్బింగ్ స్టూడియోలో ప‌వ‌న్ కళ్యాణ్‌ (pawan kalyan) ఉన్న ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ సినిమాలో సాయి ధ‌ర‌మ్ తేజ్ (sai dharam tej) కూడా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన వినోద‌య సీతం సినిమాకు రీమేక్‌గా బ్రో  (bro) రాబోతోంది.