Pawan Kalyan: బ్లాక్ బ‌స్ట‌ర్ రీమేక్‌కు నో చెప్పిన ప‌వ‌న్

Pawan Kalyan: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాను రీమేక్ చేద్దామంటే నో చెప్పేసార‌ట‌. ఇంత‌కీ అదేం సినిమా అనుకుంటున్నారా? ఇటీవ‌ల మ‌ల‌యాళంలో రిలీజ్ అయిన నెరు (neru). మోహ‌న్ లాల్ (mohan lal) న‌టించిన ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి రికార్డుల‌తో బీభ‌త్సం సృష్టించింది. ఇలాంటి సినిమాను ప‌వ‌న్‌తో రీమేక్ చేయిస్తే ఇంకా బాగా ఆడే ఛాన్స్ ఉంద‌ని అనుకున్నారట‌.

ఇందుకు ముందు ప‌వ‌న్ కూడా ఒప్పుకున్నారు. హిందీలో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం అందుకున్న పింక్ సినిమాను తెలుగులో ప‌వ‌న్ వకీల్ సాబ్ టైటిల్‌తో రీమేక్ చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నారు. దీంతో మ‌రోసారి లాయర్ గెట‌ప్ వేద్దాం అనుకున్నారు. నెరు కూడా కోర్ట్ రూం డ్రామా కావ‌డంతో ప‌వ‌న్ ఈ సినిమాను రీమేక్ చేసేందుకు ముందు ఒప్పుకున్నారు.

మ‌న‌సు మార్చుకున్న ప‌వ‌న్

అయితే నెరు కోర్ట్ రూం డ్రామా అని సినిమా చూడ‌కుండానే రీమేక్‌కు ఒప్పుకున్న ప‌వన్.. ఆ త‌ర్వాత సినిమా చూసి ఇది తెలుగు ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవ్వ‌దు వ‌ద్దు అని చెప్పేసార‌ట‌.