Pawan Kalyan: మామా మేన‌ల్లుడి సినిమాకు టైటిల్ క‌న్ఫామ్!

Hyderabad: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌(pawan kalyan), సాయి ధ‌ర‌మ్ తేజ్‌ల(sai dharam tej) కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమాకు టైటిల్ క‌న్ఫామ్ అయిపోయింది. స‌ముద్ర‌ఖ‌ని(samuthirakani) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు బ్రో(bro) అనే టైటిల్ ఖ‌రారు చేసారు. వ‌చ్చే వారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేస్తార‌ట‌. ఈ మ‌ధ్య‌కాలంలో మీమ్స్ ఎక్కువైపోయి అంద‌రూ ఒక‌రినొక‌రు “బ్రో” అని పిలుచుకుంటున్నారు. జెండ‌ర్‌తో సంబంధంలేకుండా ఈ ప‌దాన్ని వాడేస్తున్నారు. దాంతో ఈ బ్రో అనే ప‌దం దేశ‌వ్యాప్తంగా కామ‌న్ అయిపోయింది. అయితే ఇది అంద‌రూ పిలుచుకుంటున్న “బ్రో” నా .. లేక‌పోతే  BROకి ఏమైనా వేరే అర్థం ఉందా అనేది మ‌రో వారంలో తెలిసిపోతుంది. ఇప్ప‌టికే సినిమాకు సంబంధించిన చాలా మ‌టుకు షూటింగ్ అయిపోయింది. ప‌వ‌న్ అటు పాలిటిక్స్‌తో ఇటు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉండ‌టంతో ముందు ప‌వ‌న్‌, ధ‌ర‌మ్ తేజ్‌కు సంబంధించిన సీన్స్ షూట్ చేసేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక ఇందులో హీరోయిన్లుగా ఎవ‌రు న‌టిస్తున్నార‌న్న‌ది తెలియాల్సి ఉంది. త‌మిళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన వినోద‌య సీతం సినిమాకు ఇది రీమేక్‌గా రాబోతోంది.