BRO: అదిరిపోయే లుక్​లో మామా అల్లుడు!

Hyderabad: పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్(Pawan Kalyan)​, మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej)​ కలిసి నటిస్తున్న సినిమా బ్రో: ది అవతార్(BRO: The Avatar)​. ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని(Samuthirakani) రూపొందిస్తున్న ఈ సినిమా తమిళ సినిమా వినోదయా సిత్తం కు రీమేక్​గా తెరకెక్కతోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టైటిల్​ మోషన్​ పోస్టర్​ మిలియన్ల కొద్దీ వ్యూస్​తో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక ఈ మధ్యనే మార్క్​ లుక్​ ని కూడా రిలీజ్​ చేశారు. జూలై 28న విడుదలకానున్న ఈ సినిమాపై మరింత హైప్​ క్రియేట్​ చేయడానికి వరుస అప్​డేట్లతో సర్​ప్రైజ్​ చేస్తున్నారు మేకర్స్.  టైటిల్​​, మార్క్​ పోస్టర్లతో భారీ అంచనాలను క్రియేట్​ చేసిన మేకర్స్​ ఇప్పుడు ఇద్దరూ కలిసి ఉన్న పోస్టర్​ని రిలీజ్ చేశారు మేకర్స్.

ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. పవన్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో కేతిక శర్మ (Ketika Sharma) సాయి ధరమ్ కి జోడిగా కనిపించబోతుందని తెలుస్తుంది. అలాగే ప్రియా వారియర్ చెల్లి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. వరుస అప్​డేట్లతో చిత్రబృందం సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. ప్రస్తుతం తాజా పోస్టర్ నెట్టింట​ వైరల్​గా మారింది.