Pawan Kalyan: ప‌వ‌న్ అస‌లు పేరేంటో తెలుసా? పేరు పెట్టింది కుటుంబీకులు కాదు

pawan kalyan original name is kalyan babu

Pawan Kalyan:  ప‌వ‌ర్ స్టార్.. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అస‌లు పేరేంటో తెలుసా? ఆయ‌న సోద‌రుడు మెగాస్టార్ చిరంజీవి క‌ళ్యాణ్ బాబు క‌ళ్యాణ్ బాబు అని పిలుస్తుంటే ప్రేమ‌తో ముద్దుగా బాబు అని పిలుస్తున్నారు అనుకుంటున్నారు కొంత మంది. అయితే కొంద‌రికి తెలీని విష‌యం ఏంటంటే.. ప‌వ‌న్ అస‌లు పేరు క‌ళ్యాణ్ బాబు.

మ‌రి క‌ళ్యాణ్‌కి ముందు ఈ ప‌వ‌న్ ఎలా వ‌చ్చింది అనుకుంటున్నారా? దాని వెనుక చిన్న ఫ్లాష్‌బ్యాక్ ఉంది. ప‌వ‌న్ క‌రాటేలో మాంచి ప‌ట్టు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌నకు క‌రాటే నేర్పిన గురువు షిహాన్ హుస్సేనీ. ఆయ‌నే క‌ళ్యాణ్‌కు ముందు ప‌వ‌న్ అని పెట్టి పేరును ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని మార్చేసారు.

షిహాన్ హుస్సేనీ చెన్నైకి చెందిన మార్ష‌ల్ ఆర్ట్స్ నిపుణుడు. ప‌లు సినిమాల్లో కూడా న‌టించారు. ఆయ‌న్ను చూసిన ప‌వ‌న్ క‌రాటే నేర్చుకుంటే షిహాన్ నుంచే నేర్చుకుంటాన‌ని ప‌ట్టుబ‌ట్టాడ‌ట‌. 1990ల్లో షిహాన్ క‌రాటే నేర్పించ‌డం మానేసారు. ఆ స‌మ‌యంలో షిహాన్ ఓ సెక్యూరిటీ ఏజెన్సీని న‌డిపించ‌డంలో బిజీ అయిపోయాడు. కానీ ప‌వన్ మాత్రం క‌రాటే నేర్పిస్తారా లేదా అని నెల రోజుల పాటు షిహాన్ ఇంటికెళ్లి కూర్చునేవాడు. దాంతో ప‌వ‌న్ ప‌ట్టుద‌ల చూసి షిహాన్ నేర్పించాల‌నుకున్నాడు. ఆ స‌మ‌యంలో షిహాన్ ఉంటున్న గ‌ది శుభ్రం చేసి.. చాయ్ కూడా అందించేవాడ‌ట‌. ఈ విష‌యాన్ని షిహాన్ ఓ ఇంట‌ర్వ్యూలో పంచుకున్నాడు. స‌రిగ్గా ఈ నిజ జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌నే త‌మ్ముడు సినిమాలో రీక్రియేట్ చేసారు.