OG: ప‌వ‌న్ ఆగ‌యాజీ..!

Hyderabad: వచ్చే ఏపీ(Andhra Pradesh) ఎలక్షన్స్​లోపు వీలైనన్ని సినిమాలను పూర్తి చేయాలని పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) తన డేట్స్‌ను పక్కాగా ప్లాన్‌ చేసుకుంటున్న విషయం తెలిసిందే. గతేడాది కేవలం హరిహర వీరమల్లు ఒకటే సినిమాని అనౌన్స్​ చేసిన పవన్​ ఈ ఏడాది వరుస ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తూ ఫ్యాన్స్​ని సర్​ప్రైజ్​ చేస్తున్నారు. ఇటీవలే సముద్ర ఖని​(Samuthirakani ) దర్శకత్వంలో రూపొందనున్న వినోదయా సిత్తం రీమేక్​ పూర్తి చేశారు పవన్​ కల్యాణ్. ఇక తాజాగా సుజీత్‌(Sujith) దర్శకత్వంలో తెరకెక్కనున్నఓజీ(OG) షూటింగ్​ని కూడా పరుగులు పెట్టిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే చాలా అంచనాలు నెలకొన్నాయి. ఒక్క ప్రీ లుక్‌ పోస్టర్‌కే సోషల్‌ మీడియా షేక్‌ అయిందంటే ఏ రేంజ్‌లో ఈ సినిమాపై అంచనాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. గత వారంఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. కాగా తాజాగా పవన్‌ కల్యాణ్​ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు.

పవన్‌ కల్యాణ్‌ ఓజీ సెట్స్‌లోకి అడుగుపెట్టిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్‌ చేసి మరీ అభిమానులతో ఈ విషయాన్ని పంచుకుంది చిత్రబృందం. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. గ్యాంగ్‌స్టర్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం‌. ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి ఇండస్ట్రీ హిట్‌ను నిర్మించిన దానయ్య ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. దీనితో పాటుగా పవన్‌ హరిహర వీరమల్లు అనే పీరియాడిక్‌ సినిమా చేస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక మేనల్లుడు సాయిధరమ్‌తో కలిసి నటిస్తున్న వినోదయ్‌ సిత్తం రీమేక్‌ కూడా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ సినిమాకు పి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. వీటితో పాటుగా పవన్‌, హరీష్‌ శంకర్‌తో ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ను కూడా లైన్లో పెట్టాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్‌ మొదలుపెట్టనుంది.