Pawan Kalyan: బాబాయ్ ఆశీర్వ‌దించేసారు…పిక్చ‌ర్ ప‌ర్‌ఫెక్ట్..!

Hyderabad: మొత్తానికి వ‌రుణ్ తేజ్‌కి బాబాయ్ ప‌వన్ కళ్యాణ్ (pawan kalyan) ఆశీర్వాదం కూడా దొరికేసింది. ఓ ప‌క్క వ‌రుస షూటింగ్స్, పొలిటిక‌ల్ మీటింగ్స్‌తో బిజీగా ఉంటున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. త‌న అన్న నాగ‌బాబు కుమారుడు వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠిల‌ ఎంగేజ్‌మెంట్ (varun tej lavanya tripathi engagement) వేడుక‌కు విచ్చేసారు. బొకే ఇచ్చి కంగ్రాట్స్ చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఫ్యామిలీ మొత్తం క‌లిసి దిగిన ఫొటో బ‌య‌టికొచ్చింది. ప్యాంట్, ష‌ర్ట్‌లో ప‌వ‌న్ మాస్ ఎంట్రీతో ఫ్యాన్స్ తెగ ఖుష్ అయిపోతున్నారు.