Pawan Kalyan: అక్క‌డ డిప్యూటీ సీఎం.. ఇక్క‌డ నిర్మాత‌.!

pawan kalyan and supriya yarlagadda meets after 28 years

Pawan Kalyan: టాలీవుడ్‌కి చెందిన ప్ర‌ముఖ నిర్మాత‌లంతా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిసారు. సినిమా రంగంలో ఉన్న ప‌లు స‌మ‌స్య‌ల గురించి ఆయ‌న‌తో చ‌ర్చించారు. అయితే ఈ స‌మావేశంలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన దృశ్యం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ కూడా ప‌వ‌న్‌ను క‌లిసారు. 1996లో వ‌చ్చిన అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి సినిమాలో ప‌వ‌న్ సుప్రియ జంట‌గా న‌టించారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇలా క‌ల‌వ‌డంతో ఫ్యాన్స్ అప్ప‌టి రోజుల‌ను గుర్తుచేసుకుంటున్నారు.