Pavitra Lokesh: “ఆ నరేష్‌కి ఈ వయసులో లవ్ ఏంటి?”
Pavitra Lokesh: ప్రముఖ నటుడు వీకే నరేష్ (vk naresh), పవిత్ర లోకేష్ ప్రేమించుకుంటున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరి డేటింగ్ ఇప్పుడు టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. మళ్లీ పెళ్లి (malli pelli) సినిమాతో తమ లవ్ స్టోరీని బయోపిక్‌లా కూడా తీసి ప్రేక్షకులకు చూపించారు. అయితే వీరిద్దరి లవ్ స్టోరీని ఇతర డైరెక్టర్లు కూడా బాగా వాడేస్తున్నారు.
నితిన్, శ్రీలీల నటించిన ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్ (extraordinary man) సినిమా ఈరోజు రిలీజ్ అయింది. అయితే సినిమాలో పవిత్ర లోకేష్ కీ రోల్‌లో నటించారు. ఈ సినిమాలో ఆమె నరేష్ గురించి ఓ డైలాగ్ చెప్తారు. ఆ విజయ నిర్మల కొడుకేంటి.. ఈ వయసులో లవ్ ఏంటి అనే డైలాగ్‌ను ఆమె చేతే చెప్పించడం ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ డైలాగ్ పవిత్ర చేత చెప్పిస్తే మంచి ఇంపాక్ట్ ఉంటుందని దర్శకుడు భావించినట్లున్నారు. అయినా ఇలాంటి డైలాగులు సినిమా మొత్తం పెట్టినా కథలో బలం ఉంటేనే ఆ సినిమా హిట్ అవుతుంది. ఇప్పటి వరకు జనాలు సినిమా గురించి చెప్తున్న దానిని బట్టి చూస్తే సినిమా ఆర్డినరీగా కూడా లేదు అని తెలుస్తోంది.