Pallavi Prashanth: టైటిల్ గెలవగానే .. యాంకర్ అని కూడా చూడకుండా..
Pallavi Prashanth: బిగ్ బాస్ (biggboss) తెలుగు విన్నర్‌గా పల్లవి ప్రశాంత్ టైటిల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అసలు ఈ దిక్కుమాలిన షో ఎందుకు చూస్తారో తెలీదు కానీ ఒకవేళ చూసినా షోని షోలా కాకుండా మరీ పర్సనల్‌గా తీసుకుంటున్నారు. అందుకే ప్రశాంత్ టైటిల్ గెలవగానే ఆయన ఫ్యాన్స్ రన్నరప్ అమర్‌దీప్ (amardeep) ఫ్యాన్స్‌కి మధ్య పెద్ద గొడవ జరిగింది. దాంతో పల్లవి ప్రశాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేసి సుమోటోగా తీసుకున్నారు.
ఈ సంగతి పక్కన పెడితే.. బిగ్ బాస్ నుంచి పిలుపు వచ్చే వరకు ఎంత మంది ఇంటర్వ్యూలకు పిలిస్తే అంత మంది దగ్గరికి వెళ్లిన పల్లవి ప్రశాంత్‌కి టైటిల్ గెలిచాక కాస్త పొగరెక్కినట్లుంది. ప్రముఖ యాంకర్ శివకు ప్రశాంత్ వల్ల చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. టైటిల్ గెలిచాక ఇంటర్వ్యూ కోసం ఫోన్ చేస్తే 18 గంటలు వెయిట్ చేయించి ఆ తర్వాత ఇంటికి రండి అని పిలిచాడట.స సరే అని ఇంటికి వెళ్తే లోపలికి వెళ్లేందుకు ఇంకో ఎనిమిది గంటలు బయట వెయిట్ చేయించాడట. ఇంతగా వెయిట్ చేసినందుకైనా ఇంటర్వ్యూ ఇవ్వకుండా దె***య్ అన్నాడట. ఈ విషయాన్ని శివ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ త్వరలో ఈ అంశంపై ఓ వీడియోను రిలీజ్ చేస్తానని అన్నారు.