The Kerala Story: భయపడుతున్న OTT సంస్థలు?
Hyderabad: ఎన్నో వివాదాలను ఎదుర్కొని సంచలనం సృష్టించిన ది కేరళ స్టోరీ (the kerala story) సినిమా OTTలోకి వచ్చే అవకాశాలు కనిపించడంలేదు. సుదీప్తో సేన్ (sudipto sen) అనే బెంగాలీ డైరెక్టర్ తీసిన ఈ సినిమాలో అదా శర్మ (adah sharma) మెయిన్ రోల్లో నటించారు. రిలీజ్ అయినప్పటి నుంచి పొలిటికల్, సినీ వర్గాల నుంచి రచ్చ మొదలైంది. సినిమాలో చూపించినవన్నీ అబద్ధాలేనంటూ కోర్టు వరకూ కూడా వెళ్లారు. డైరెక్టర్ బెంగాలీ అయినప్పటికీ లేని పోని గొడవలు అవుతాయేమోనన్న భయంతో ఈ సినిమాను రిలీజ్ చెయ్యనివ్వలేదు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమాను కొనుక్కోవడానికి ఏ OTT ముందుకు రావడంలేదు. ఎక్కడ సినిమాను కొనుగోలు చేస్తే ఎవరు వచ్చి తమపై దాడి చేస్తారో అన్న భయంలో ఉన్నాయి OTTలు. మరోపక్క థియేటర్లో కాకుండా OTTలో ఈ సినిమాను (the kerala story) చూడాలని చాలా మంది అనుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. మరి ఏ OTT ధైర్యం చేసి ఈ సినిమాను కొనుగోలు చేస్తుందో వేచి చూడాలి.